CM KCR Kondagattu : ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు – కేసీఆర్
దేశంలోనే అతి పెద్ద హనుమత్ విగ్రహం
CM KCR Kondagattu : దేశంలోనే అత్యద్భుతమైన పుణ్య క్షేత్రంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు సీఎం కేసీఆర్. బుధవారం కొండగట్టును(CM KCR Kondagattu) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమీక్ష చేపట్టారు. గుడి అభివృద్ది కోసం రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా ఆలయాన్ని తీర్చి దిద్దుతామని చెప్పారు . ఇది ఛాలెంజ్ తో కూడుకున్న ప్రాజెక్టు అని అన్నారు సీఎం.
భక్తులకు వసతులు, హంగులతో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. కొండగట్టులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ది చేయాలని స్పష్టం చేశారు కేసీఆర్. హనుమాన్ జయంతిని దేశంలోనే అత్యంత గొప్పగా ఎవరూ ఊహించని రీతిలో జరపాలని అన్నారు సీఎం.
వేలాది మంది ఆంజనేయుడి దీక్ష ధారణ, విరమణ చేసేందుకు వస్తారని , భక్తులకు ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా చూడాలన్నారు. 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ది, విస్తరణ పనులు చేయాలన్నారు. పెద్ద గోడ, పార్కింగ్ ,పుష్కరిణి, అన్నదాన సత్రం , కళ్యాణ కట్ట, కోనేరును అద్భుతంగా తీర్చి దిద్దాలని కేసీఆర్ ఆదేశించారు. తాను మళ్లీ వస్తానని , ఆలయ అభివృద్దిని స్వయంగా పరీక్షిస్తానని హెచ్చరించారు సీఎం.
ఇప్పటికే ప్రకటించిన నిధులతో పాటు అదనంగా రూ. 500 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి(CM KCR Kondagattu). వీటితో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొండగట్టు ఉండాలని కోరారు. ఏ మాత్రం అలసత్వం వహించ కూడదని చెప్పారు. 86 ఎకరాల స్థలంలో అతి పెద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం.
Also Read : దొర పాలనలో కబ్జాల పర్వం – షర్మిల