China Closes Consular : పాకిస్తాన్ లో చైనా ‘కాన్సులర్’ క్లోజ్
పాకిస్తాన్ కు చైనా బిగ్ షాక్
China Closes Consular : జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఇప్పటికే బాంబు దాడులతో దద్దరిల్లుతోంది పాకిస్తాన్. చైనా పౌరులు కొందరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ తరుణంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ లోని కాన్సులేట్ కార్యాలయాన్ని చైనా తాత్కాలికంగా మూసి(China Closes Consular) వేసింది. అధికారికంగా ప్రకటించింది. ఎంబసీకి సంబంధించి సాంకేతిక సమస్య కారణంగా దీనిని క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
అంతే కాకుండా తమ దేశానికి చెందిన చైనా పౌరులు పాకిస్తాన్ లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే తమ దేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చింది చైనా. గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది.
క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల కారణంగా పాకిస్తాన్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్ది రోజుల తర్వాత తన రాయబార కార్యాలయంలోని కాన్సులర్ విభాగాన్ని మూసి వేస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్యనా లేక ఇతర ఏదేని కారణమా అన్నది చైనా స్పష్టం చేయలేదు.
ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాత్రం అందుబాటులో ఉంచ లేదు చైనా. ఫిబ్రవరి 13, 2023 నుండి తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా చైనా ఎంబసీ లోని కాన్సులర్ ను మూసి వేస్తున్నామని చైనా స్పష్టం చేసింది. పాకిస్తాన్ తాలిబన్ గ్రూప్ ప్రభుత్వంతో సంధిని విరమించుకుంది. దీని తర్వాత గత ఏడాది నుంచి పాకిస్తాన్ తీవ్రవాద దాడులకు గురవుతోంది. ఒక రకంగా చైనా క్లోజ్ చేసుకోవడం పెద్ద దెబ్బ.
Also Read : అమెరికా అధ్యక్ష రేసులో నేనున్నా