IND vs WI Womens T20 World Cup : వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర
విండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
IND vs WI Womens T20 World Cup : దాయాది పాకిస్తాన్ పై ప్రారంభ మ్యాచ్ లోనే అదుర్స్ అనిపించిన భారత జట్టు అమ్మాయిలు వెస్టిండీస్ తో జరిగిన రెండో కీలక మ్యాచ్ లో సత్తా చాటారు. తమకు ఎదురు లేదని చాటారు. దీప్తి శర్మ, రిచా ఘోష్ లు రాణించడంతో వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా.
ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన దీప్తి శర్మ 3 కీలక వికెట్లు పడగొట్టింది. పొట్టి ఫార్మాట్ లో భారత మహిళా క్రికెట్ లో(IND vs WI Womens T20 World Cup) 100 వికెట్లు తీసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.
అంతకు ముందు బరిలోకి దిగిన టీమిండియా 119 పరుగుల టార్గెట్ ను సునాయసంగా ఛేదించింది. రిచా ఘోష్ 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. 33 రన్స్ చేసింది. రిచా ఘోష్ తో కలిసి కౌర్ ఇద్దరూ 72 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఓపెనర్లు షెఫాలీ వర్మ 28 రన్స్ చేస్తే స్మృతి మంధాన 10 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బౌలర్ కరిష్మా రామ్ హారక్ 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. జెమీమా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసింది. ఇక హేలీ మాథ్యుస్ 12 రన్స్ చేసి 1 వికెట్ కూల్చింది. ఇక 32 బంతులు ఆడి నాటౌట్ గా నిలిచింది రిచా ఘోష్. 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 రన్స్ టార్గెట్ ఛేదించింది భారత్.
Also Read : మూడు ఫార్మాట్ లలో ఇండియా టాప్