PAKW vs IREW T20 World Cup : పాక్ చేతిలో ఐర్లాండ్ ఓటమి
70 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
PAKW vs IREW T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంచనాలు లేని శ్రీలంక జట్టు రెండు మ్యాచ్ లలో ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఇక భారత జట్టు మొదట దాయాది పాకిస్తాన్ ను 7 వికెట్ల తేడాతో ఓడించగా వెస్టిండీస్ ను 6 వికెట్ల తేడాతో ఖంగుతినిపించింది. ఇక భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటింది. ఏకంగా 70 పరుగుల భారీ తేడాతో విక్టరీని నమోదు చేసింది.
పాకిస్తాన్ క్రికెటర్ మునీబా అలీ అద్భుతంగా రాణించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఏకంగా మునీబా దుమ్ము రేపింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో(PAKW vs IREW T20 World Cup) సెంచరీని నమోదు చేసింది. ఏకంగా 102 పరుగులతో ఆకట్టుకుంది. జట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహద పడింది మునీబా అలీ. ఎడమ చేతి బ్యాటర్ అయిన మునీబా అలీ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. అనంతరం 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 16.3 ఓవర్లలోనే 95 పరుగులకు ఆలౌటైంది. దీంతో వరల్డ్ కప్ లో బి – గ్రూప్ లో తొలి విజయాన్నినమోదు చేసింది పాకిస్తాన్. ఇక ఇంగ్లండ్ , ఇండియా చెరో నాలుగు పాయింట్లతో ఉండగా పాకిస్తాన్ 2 పాయింట్లతో ఉంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా హాట్ ఫెవరేట్ గా ఉన్నాయి వరల్డ్ కప్ లో.
Also Read : వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర