Akunuri Murali KCR : విద్యా రంగంపై కేసీఆర్ వివక్ష
నిప్పులు చెరిగిన ఆకునూరి మురళి
Akunuri Murali KCR : సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు. ఆయన తెలంగాణలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. గత కొంత కాలంగా కేసీఆర్(Akunuri Murali KCR) ను టార్గెట్ చేశారు. కావాలని విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించారు.
భారత రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టాల్సి ఉండగా ఈ మూడు ప్రాధాన్యత రంగాలను కావాలని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారంటూ ఆరోపించారు ఆకునూరి మురళి. ప్రత్యేకంగా విద్యను కావాలని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు వేలాది ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.
తాజాగా దేశంలో ప్రకటించిన విద్యా రంగం అభివృద్దికి సంబంధించిన వెల్లడించిన జాబితాలో తెలంగాణ స్థానం 7వ ర్యాంకుకు దిగజారడం దారుణమని పేర్కొన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali KCR). పేదలు, మధ్య తరగతి ప్రజల పిల్లలకు విద్యను దూరం చేయడంలో భాగంగానే మౌలిక వసతులను కల్పించేందుకు ముందుకు రావడం లేదని సంచలన ఆరోపణలు చేశారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించాలని కోరారు ఎస్డీఎఫ్ కన్వీనర్. ఊరికో బడి ఉండాల్సి ఉండగా గల్లీకో వైన్ షాప్ ను చేశారంటూ ధ్వజమెత్తారు.
దొర పాలన సాగిస్తూ మోసం చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో రూ. 7,268 కోట్లు అని చెప్పి కనీసం రూ. 300 కోట్లు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Also Read : మీడియా స్వేచ్ఛపై దాడి తగదు