RS Praveen Kumar BBC : మీడియా స్వేచ్ఛపై దాడి తగదు
బీబీసీపై ఐటీ దాడులపై ఆగ్రహం
RS Praveen Kumar BBC : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించడం, వేధింపులకు గురి చేయడం, దాడులకు పాల్పడడం గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తోందని ఆరోపించారు.
ఇలాంటి చర్యలు రాచరిక పాలనను గుర్తుకు తెస్తుందని పేర్కొన్నారు. నిజాలను వెలికి తీయడం, వాస్తవాలను ప్రతిబింబించేలా కథనాలు ప్రసారం చేస్తూ వస్తున్న మీడియాపై ఉక్కుపాదం మోపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్.
ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. అబద్దాలను , అవాస్తవాలను ప్రచారం చేయడంలో ముందంజలో ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వడం కొనసాగుతూ వస్తోందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar BBC).
ఇదే సమయంలో ప్రజల తరపున తమ వాయిస్ ను ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తూ వస్తున్న బీబీసీపై కావాలని వేధింపులకు పాల్పడడం కక్ష సాధింపు చర్యలను ప్రతిబింబిస్తోందని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా గత నెల జనవరి 24న మోదీ ది క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ఆయన సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అల్లర్లు, ఘోరాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దానిపై నిషేధం విధించింది. బీబీసీపై ఐటీ శాఖ దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు ఆర్ఎస్పీ. దేశంలో, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు బీఎస్పీ చీఫ్.
Also Read : విద్యా రంగంపై కేసీఆర్ వివక్ష