Rahul Gandhi Slams : స్పీకర్ నోటీస్ రాహుల్ సీరియస్
సమాధానం ఇచ్చిన కాంగ్రెస్ నేత
Rahul Gandhi Slams : లోక్ సభ వేదికగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారారు. అదానీ గ్రూప్ కు ప్రధానమంత్రికి ఉన్న సంబంధం ఏమిటిని అని నిలదీశాడు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది.
పార్లమెంట్ రూల్స్ ను అతిక్రమించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రిని వ్యక్తిగతంగా విమర్శించారని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా రాహుల్ గాంధీ(Rahul Gandhi Slams) వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
ఈ మేరకు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని , వెంటనే లోక్ సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు సిద్దంగా ఉన్నానని మరోసారి సభ సాక్షిగా ప్రకటించారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ(Rahul Gandhi Slams) చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఇందుకు సంబంధించిన నోటీసులపై సవివరమైన సమాధానాలను ఆధారాలతో సహా స్పీకర్ కు అందజేసినట్లు స్పష్టం చేసింది. వివరాలకు ఆన్సర్ ఇచ్చినా ఎందుకని పదే పదే టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.
Also Read : కొండపోచమ్మను పరిశీలించిన సీఎం