Kanna Lakshminarayana Resigns : కాషాయానికి ‘కన్నా’ కటీఫ్
ఏపీ బీజేపీకి బిగ్ షాక్
Kanna Lakshminarayana Resigns : ఏపీ కాషాయ (భారతీయ జనతా పార్టీ) పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ మాజీ స్టేట్ చీఫ్ , మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గురువారం పార్టీకి రాజీనామా చేశారు.
ఆయన తన రిజైన్ లెటర్ ను పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు పంపించారు. రాజీనామా చేసే కంటే ముందు తన అనుచరులతో కీలక భేటీ చేపట్టారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 23 లేదా 24న అధికారికంగా టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీ తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నారు. తన వారసుడిగా సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించిన నాటి నుంచి కన్నా లక్ష్మీ నారాయణ కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్నా ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ వచ్చారు. బీజేపీ నుండి వైదొలగాలని తనంతకు తానుగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
వ్యక్తిగత, బలవంతం కారణంగా వెంటనే అమలులోకి వచ్చేలా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా(Kanna Lakshminarayana Resigns) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తన కారుకు ఉన్న బీజేపీ జెండాను కూడా తొలగించారు. ఇదిలా ఉండగా కాపు సామాజికవర్గానికి చెందిన వారు.
ఓట్లను చీల్చేందుకు ఆయనకు పార్టీ చీఫ్ కట్టబెట్టింది బీజేపీ. 2018 ఏప్రిల్ లో పార్టీ చీఫ్ గా నియమితులయ్యారు. అయితే టీడీపీకి లోపాయికారిగా పని చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Also Read : సోము వల్లే రాజీనామా – కన్నా