PM Modi Counter China : మోదీ వ్యూహం చైనా దిగ్బంధం
త్రిముఖ ప్రణాళికతో బిగ్ షాక్
PM Modi Counter China : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిముఖ వ్యూహానికి తెర లేపారు. ప్రధానంగా ప్రతి దానికి కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. దూకుడును ప్రదర్శిస్తున్న డ్రాగన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చే ప్లాన్ కు శ్రీకారం చుట్టారు.
హిమాలయ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాలకు చివరి వరకు కనెక్టివిటీని పెంచడం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు అదనపు ఐటీబీపీ బెటాలియన్లను పెంచడం, లడఖ్ నుండి షింకున్ టన్నెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పై ప్రయారిటీ ఇచ్చారు చైనాతో 3,488 కిలోమీటర్ల ఎల్ఏసీ పొడవునా భారత రక్షణను సుస్థితరం చేసేందుకు అనుసంధానం చేశారు.
వీటితో పాటు మరో ఏడు ఐటీబీపీ బెటాలియన్లను పెంచడం, శక్తివంతమైన గ్రామ పథకానికి శ్రీకారం చుట్టడం, షింకున్ లా టన్నెల్ ను క్లియర్ చేయడం వంటివి ప్రధానమంత్రి తీసుకున్న సంచలన నిర్ణయాలు.
చైనా, భారత్ సరిహద్దు వెంట భారతదేశ రక్షణను ఓరకంట కనిపెడుతూ ఉన్నారు చైనా చీఫ్ జిన్ పింగ్ . టిబెట్ విధానాన్ని ఎదుర్కొనేందుకు ఇది త్రిముఖ వ్యూహంగా భావిస్తున్నారు. టిబెట్ ఇప్పటికీ చైనాకు ఇబ్బందిగా ఉంది.
ఇక ప్రధానమంత్రి మోదీ(PM Modi Counter China) తీసుకున్న మూడు నిర్ణయాలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉన్నాయి. టిబెట్ , జిన్ జియాంగ్ లోని వెస్ట్రన్ థియేటర్ కమాండ్ లో పీఎల్ఏ నిర్వహించిన మూడు స్థాయి సరిహద్దు భద్రతకు సమాధానంగా ఉన్నాయి. సరిహద్దుల్లో గార్డులు, జిల్లా పోలీసులు, రిజర్వ్ తో కూడిన సరిహద్దు గ్రామాలను రూపొందించింది చైనా. భారత్ కూడా మూడంచెల విధానాన్ని అమలు చేస్తోంది.
Also Read : స్పీకర్ నోటీస్ రాహుల్ సీరియస్