Revanth Reddy CM KCR : కరెంట్ కష్టం కేసీఆర్ మోసం – రేవంత్
హామీలు ఇవ్వడంలో సీఎం నెంబర్ వన్
Revanth Reddy CM KCR : తెలంగాణ పేరుతో దోచుకుండు. ఎక్కడ పడితే అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది సర్కార్. తినేందుకు తిండి లేదు..చేసేందుకు పని లేదు. పొద్దస్తమానం 24 గంటలు కరెంట్ ఇస్తానని మాయమాటలు చెపుతుండు. ప్రజల చెవుల్లో పూలు పెట్టడంలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్.
జనం నెత్తిన మరోసారి కరెంట్ ఛార్జీల వాత పెట్టేందుకు రెడీ అవుతున్నాడంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy CM KCR). ఆయన చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం హన్మకొండలో కొనసాగుతోంది. కరెంట్ కోతలు లేవంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఊర్లల్లోకి వస్తే తెలుస్తుంది పరిస్థితి ఏమిటనేది.
రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించు కోవడం లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గురువారం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యుత్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ తన ప్రగతి భవన్ లో మాత్రం కరెంట్ పోకుండా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. పోయే కాలం దగ్గర పడిందన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, రైతులను ఆదుకుంటామని అన్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న కరెంట్ సరఫరా రైతులకు సరి పోవడం లేదని, అర్థం పర్థం లేకుండా ఇస్తుండడం వల్ల వేసుకున్న పంటలకు నీరు పెట్టలేక పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్రీ ఫేజ్ కరెంట్ ను ఇష్టానుసారం కాకుండా టైమ్ ప్రకారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ ను.
Also Read : వెంకన్నకు జగ్గన్న సపోర్ట్