Neal Mohan CEO : యూట్యూబ్ సిఇఓగా నీల్ మోహన్
వెల్లడించిన దిగ్గజ సంస్థ గూగుల్
Neal Mohan CEO : మరో భారతీయ అమెరికన్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస భారతీయుడైన నీల్ మోహన్ (Neal Mohan CEO) ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సామాజిక మాధ్యమంగా పేరొందిన యూట్యూబ్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం గూగుల్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుతం నీల్ మోహన్(Neal Mohan CEO) యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఇక నుంచి యూట్యూబ్ మాధ్యమానికి కొత్తగా హెడ్ గా ఉంటారని, బాధ్యతలు స్వీకరిస్తారని గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలిపింది.
ఇక ప్రవాస భారతీయుడైన నీల్ మోహన్ గతంలో గూగుల్ కంటే ముందు ఎంఎస్ వోజ్ కిక్కి ఇంటెల్ కార్పొరేషన్ , బ్రెయిన్ అండ్ కంపెనీలో పని చేశారు వివిధ స్థాయిలలో. ఇప్పటి వరకు యూట్యూబ్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సుసాన్ వోజోకికీ ఉన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు సిఇఓగా పని చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్ లైన్ వీడియో ప్లాట్ ఫారమ్ గా గుర్తింపు పొందింది యూట్యూబ్.
గతంలో గూగుల్ లో యాడ్ ప్రొడక్ట్ లకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వోజోకికీ . 2014లో ఆమె యూట్యూబ్ కు సిఇఓగా ఎంపికయ్యారు. గూగుల్ కు సంబంధించిన తొలి ఉద్యోగులలో ఆమె ఒకరు. 25 ఏళ్లుగా అందులోనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఐటీ రంగాన్ని ఏలుతుండడం విశేషం.
Also Read : 840 ఫ్లైట్స్ కు ఎయిర్ ఇండియా ఆర్డర్