BBC IT Raids Ends : బీబీసీ ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు

ఎప్ప‌టి లాగే ప‌ని చేస్తాం..భ‌య‌ప‌డం

BBC IT Raids Ends : ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో కేంద్ర ఆదాయ ప‌న్ను శాఖ గ‌త మూడు రోజులుగా చేప‌ట్టిన సోదాలు ముగిశాయి. సిబ్బందికి చెందిన మొబైల్స్ , ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు సీజ్ చేసింది ఐటీ శాఖ‌.

మొత్తం స్కాన్స్ కూడా చేశారు. దాడుల స‌మ‌యంలో బీబీసీకి చెందిన 10 మంది ఉద్యోగులు సెంట్ర‌ల్ ఢిల్లీలోని క‌స్తూర్బా గాంధీ మార్గ్ లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో మూడు రోజులు గ‌డిపారు. వారిని ఎక్క‌డికీ వెళ్ల‌నీయ‌లేదు ఐటీ శాఖ అధికారులు. ఆ త‌ర్వాత వీరు ఇంటికి వెళ్లి పోయారు. ఐటీ ప‌న్ను శాఖ సోదాలు క‌ల‌క‌లం రేపాయి. 

ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేశాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, సీపీఎం పార్టీల‌కు చెందిన నాయ‌కులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు రోజుల పాటు నిరంత‌రాయంగా దాడులు(BBC IT Raids Ends)  చేప‌ట్టిన త‌ర్వాత ముగిసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఐటీ శాఖ‌.  

సోదాల‌లో భాగంగా డిజిట‌ల్ రికార్డులు, ఫైళ్ల‌ను ప‌రిశీలించింది. బ్రిట‌న్ ప‌బ్లిక్ బ్రాడ్ కాస్ట‌ర్ సీనియ‌ర్ ఎడిట‌ర్ల‌తో స‌హా 10 మంది ఉద్యోగుల‌ను విచారించింది ఐటీ శాఖ‌. 

ఇదిలా ఉండ‌గా బీబీసీ ఆఫీసుల‌పై జ‌రిపిన సోదాల‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను శుక్ర‌వారం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌లేదు. 

ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అధికారిక బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ద్వారా డ‌బ్బులు చేతులు మార‌డాన్ని సూచించే ప‌న్ను, బినామీ వంటి కీల‌క ప‌దాల‌తో ప‌న్ను అధికారులు మొత్తం స్కాన్ చేశార‌ని బీబీసీ సిబ్బంది తెలిపారు. 

బీబీసీ అనేది విశ్వ‌స‌నీయ‌మైన , స్వ‌తంత్ర మీడియా సంస్థ‌. భ‌య‌ప‌డ‌కుండా, నిర్భీతితో ఎప్ప‌టి లాగే ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ట్వీట్ చేసింది బీబీసీ.

Also Read : ప్ర‌జా గొంతుకను వినిపిస్తాం – బీబీసీ

Leave A Reply

Your Email Id will not be published!