Amit Shah E Verification : 5 రోజుల్లో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ – షా
కేంద్ర హోం శాఖ మంత్రి కామెంట్స్
Amit Shah E Verification : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర రాజధాని ఢిల్లీలో కేవలం 5 రోజుల్లో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 2023 ఢిల్లీ పోలీసులకు ముఖ్యమైన సంవత్సరమని పేర్కొన్నారు. ఎందుకంటే రాబోయే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ షా(Amit Shah E Verification).
76వ రైజింగ్ డే పరేడ్ లో కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఢిల్లీ పోలీసులలో చేర్చబడిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను ప్రజలకు అంకితం చేశారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ (ఎన్ఎఫ్ఎస్ యు) ఢిల్లీ క్యాంపస్ లోని అకడమిక్ కాంప్లెక్స్ ను అమిత్ షా ప్రారంభించారు.
ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు ఇకపై తమ పాస్ పోర్ట్ ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే వారు గత 15 రోజుల కంటే ఐదు రోజుల లోపు క్లియరెన్స్ పొందుతారని చెప్పారు అమిత్ షా(Amit Shah E Verification). మొబైల్ ఫోన్ లు, టాబ్లెట్ కంప్యూటర్ ల ద్వారా పాస్ పోర్ట్ వెరిఫికేషన్ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. సగటున పాస్ పోర్ట్ ల కోసం రోజూ 2,000 దరఖాస్తులు వస్తున్నాయని , వాటి ఆన్ లైన్ ప్రాసెసింగ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని మాయాపురిలో హత్యకు గురైన అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ శంభు దయాల్ కు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు కేంద్ర హోం శాఖ మంత్రి.
Also Read : ప్రజా గొంతుకను వినిపిస్తాం – బీబీసీ