UK MP Bob Blackman Modi : బీబీసీపై ఫైర్ మోదీ సూపర్
ఇది పూర్తిగా ఉద్దేశ పూర్వకమైనది
UK MP Bob Blackman Modi : ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ ప్రసారం చేసిన మోదీ ది క్వశ్చన్ పై చర్చ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి కేంద్ర ఆదాయ పన్ను శాఖ మూడు రోజుల పాటు సోదాలు జరిపింది. మోదీ బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సీరియస్ గా స్పందించారు బ్రిటీష్ ఎంపీ బ్లాబ్ బ్లాక్ మెన్(UK MP Bob Blackman). ఆయన బీబీసీపై నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా డ్యామేజ్ చేసేలా ఉందన్నారు. ఆయన మోదీకి మద్దతు పలికారు.
ఈ మేరకు కీలక ప్రకటన చేశారు బాబ్ బ్లాక్ మన్. ప్రచారానికి సంబంధించిన వీడియోగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా నాసిరకం జర్నలిజం అంటూ కొట్టి పారేశారు. విచిత్రం ఏమిటంటే బాబ్ బ్లాక్ మన్ పాలక కన్జర్వేటివ్ సభ్యుడు, హారో ఈస్ట్ ఎంపీగా ఉన్నారు.
దానిని ప్రసారం చేయకూడదంటూ కోరారు. 2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసిన దావాలపై భారత దేశానికి చెందిన సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సమయంలో తాను మాట్లాడటం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు బాబ్ బ్లాక్ మన్(UK MP Bob Blackman). ఆయన జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు.
ఇది కొత్తది కాదు చాలా కాలం నుంచి జరుగుతూ వస్తోంది. చిన్న దానిని పెద్దగా చేయడం వల్ల ఎవరికి లాభమో బీబీసీ గుర్తించాలని స్పష్టం చేశారు. ఒక రకంగా బీబీసీని ఏకి పారేశారు. ఐటీ శాఖ అధికారులు, బీబీసీకి మధ్య చర్చలు జరిగాయని ఇది వారి వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు బాబ్ బ్లాక్ మన్. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ శాంతి కోసం ప్రయత్నం చేశారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : ప్రజా గొంతుకను వినిపిస్తాం – బీబీసీ