Elon Musk Shuts : ఢిల్లీ..ముంబైల‌లో ట్విట్ట‌ర్ ఆఫీసులు క్లోజ్

సిబ్బందిని ఇంటికి పంపిన మ‌స్క్

Elon Musk Shuts : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ కొత్త బాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇప్ప‌టికే కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు. ఇప్ప‌టికే 9 వేల మందిని తొలగించాడు.

తాజాగా భార‌త దేశంలో ట్విట్ట‌ర్ కు సంబంధించి మూడు ఆఫీసులు ఉండ‌గా రెండు కార్యాల‌యాల‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇందులో ప‌ని చేస్తున్న సిబ్బందిని ఇంటికి పంపించాడు. దీంతో ఊహించ‌ని షాక్ త‌గిలింది ఎంప్లాయిస్ కు.

దేశంలోని మూడు ప్రాంతాల‌లో ట్విట్ట‌ర్ ఆఫీసులు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరుల‌లో. ప్ర‌స్తుతం ఢిల్లీ, ముంబై ల‌లోని కార్యాయాల‌ను మూసి వేస్తున్న‌ట్లు డిక్లేర్ చేశాడు ఎలోన్ మ‌స్క్(Elon Musk Shuts). గ‌త ఏడాది చివ‌ర‌లో భార‌త దేశంలోని దాదాపు 200 మంది ఉద్యోగులలో మొత్తానికి 90 శాతం మందిని తొల‌గించారు.

పొలిటిక‌ల్ కేపిట‌ల్ సిటీగా పేరొందిన ఢిల్లీతో పాటు దేశ ఆర్థిక రాజ‌ధానిగా పేరు పొందిన ముంబైలో ఆఫీసులు మూసి వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఐటీ రంగంలో కీల‌క చ‌ర్చ‌కు దారి తీసింది. ముందు నుంచీ ఎలోన్ మ‌స్క్ తాను ఎక్కువ ఖ‌ర్చును భ‌రించ లేనంటూ స్ప‌ష్టం చేశాడు.

ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం కార‌ణంగా ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన కంపెల‌న్నీ వేలాది మందిని ఇంటికి పంపిస్తున్నాయి. వీటిలో మొద‌ట‌గా ప్రారంభించింది టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్(Elon Musk Shuts).

ఇక ఇండియాలోని బెంగ‌ళూరులో కొన‌సాగుతున్న ట్విట్ట‌ర్ ఆఫీసును మాత్ర‌మే కొన‌సాగిస్తోంది. టెక్ హ‌బ్ లో ఎక్కువ మంది ఇంజ‌నీర్లు ప‌ని చేస్తున్నారు.

Also Read : యూట్యూబ్ సిఇఓగా నీల్ మోహ‌న్

Leave A Reply

Your Email Id will not be published!