Google Layoffs India : భారత్ లో 543 మంది తొలగింపు – గూగుల్
ప్రకటించిన ఐటీ దిగ్గజ సంస్థ
Google Layoffs India : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో పలువురిని సాగనంపిన సదరు సంస్థ తాజాగా భారత దేశంలో గూగుల్ సంస్థలో వివిధ విభాగాలలో పని చేస్తున్న 453 మందికి మంగళం(Google Layoffs India) పాడింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ధృవీకరించింది కూడా. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనడంతో దానిని సాకుగా చూపి మొట్ట మొదటగా టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ జాబర్స్ ను తొలగించేందుకు శ్రీకారం చుట్టాడు.
పర్మినెంట్ , కాంట్రాక్ట్ కింద 9 వేల మందిని తొలగించాడు. ఆ తర్వాత ఫేస్ బుక్ , గూగుల్ , సిస్కోతో పాటు ఇతర రంగాలకు చెందిన అమెజాన్ కూడా వేలాది మందిని తొలగించింది. వీటితో పాటు మైక్రో సాఫ్ట్ 10 వేల మందిని, మెటా ఫేస్ బుక్ లో మరో 10 వేల ఉద్యోగులను సాగనంపాయి. ఈ తరుణంలో ఇప్పటికే గూగుల్ 10 వేల మందికి పైగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్(Google Layoffs India).
తాజాగా చేసిన ప్రకటనతో ఆయా సంస్థలలో పని చేస్తున్న ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు లబో దిబో మంటున్నారు. దిక్కు తోచని స్థితిలో పడి పోయారు. శుక్రవారం ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశాడు.
ఇండియాలోని ఢిల్లీ, ముంబై లలో ఉన్న ట్విట్టర్ ఆఫీసులను మూసి వేస్తున్నట్లు ప్రకటించాడు. అంతే కాదు ఉద్యోగులలో కొందరు ఇంటి వద్ద నుంచే పని చేయాలని స్పష్టం చేశాడు. ఒక్క బెంగళూరులో మాత్రమే కార్యాలయం ఉంది.
Also Read : ఢిల్లీ..ముంబైలలో ట్విట్టర్ ఆఫీసులు క్లోజ్