Mahasena Rajesh Joins : మహాసేన రాజేశ్ టీడీపీలో చేరిక
జగన్ సర్కార్ పై సీరియస్ కామెంట్స్
Mahasena Rajesh Joins : మహాసేన రాజేశ్ శుక్రవారం టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. దళిత సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉంటూ వచ్చిన మహాసేన రాజేశ్ టీడీపీలో చేరారు(Mahasena Rajesh Joins). ఈ సందర్భంగా జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా దళిత సామాజిక వర్గంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు టీడీపీ చీఫ్.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజేశ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచీ ఏపీలో వైసీపీ చేస్తున్న ఆగడాలు, సీఎం జగన్ అసమర్థ పాలన గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూ వచ్చాడు. రాష్ట్రంలో చీకటి నెలకొందన్నారు.
ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహాసేన రాజేశ్. ప్రస్తుతం ఆనాటి చంద్రబాబు నాయుడి పాలననే బెటర్ అని కొనియాడారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జవాబుదారీతనం లేకుండా పోయిందన్నారు.
2019లో ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా పేర్కొన్నారని ఆనాడు తామంతా నమ్మామని కానీ ఇప్పుడు తెలిసింది తామందరం పూర్తిగా మోస పోయామని తెలిసి పోయిందన్నారు మహాసేన రాజేష్ . గతంలో ఎస్సీలకు ప్రత్యేకంగా 27 పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. జగన్ పవర్ లోకి వచ్చాక అన్ని పథకాలను కావాలని రద్దు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాజేశ్ .
Also Read : కన్నా ‘అబద్దం’ సోమూ ‘నిజం – జీవీఎల్