Supreme Court Adani Row : కేంద్రం ప్ర‌తిపాద‌న ‘సుప్రీం’ తిర‌స్క‌ర‌ణ‌

ప్యానెల్ పై సీల్డ్ క‌వ‌ర్ ఒప్పుకోం

Supreme Court Adani Row : అదానీ షేర్ల ప‌త‌నంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖ‌లైన ప‌లు పిటిష‌న్ల‌ను విచారించింది సుప్రీంకోర్టు. ఈ మేర‌కు తీర్పు రిజ‌ర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి ప్యానెల్ ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే ఆదేశించింది ధ‌ర్మాస‌నం. కాగా ప్యానెల్ పై కేంద్రం సీల్డ్ క‌వ‌ర్ లో పంపిస్తామ‌ని చేసిన సూచ‌న‌ను తోసి పుచ్చింది కోర్టు. కేసును ప‌రిశీలించేందుకు క‌మిటీ ఏర్పాటుపై నిర్ణ‌యాన్ని రిజ‌ర్వ్ లో ఉంచింది.

అయితే అదానీ కేసులో విచార‌ణ‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని ప్ర‌భుత్వం స‌ర్వోన్న‌త న్యాయ స్థానానికి(Supreme Court Adani Row) తెలిపింది. స్టాక్ ప‌త‌నం త‌ర్వాత నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు , పెట్టుబ‌డిదారుల‌ను ర‌క్షించేందుకు ఒక ప్యానెల్ పై కేంద్ర ప్ర‌భుత్వం చేసిన సీల్డ్ స‌మ‌ర్ప‌ణ‌ను సుప్రీంకోర్టు శుక్ర‌వారం తిర‌స్క‌రించింది. ఈ విష‌యంలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త కావాల‌ని పేర్కొంది.

కోట్లాది ఇన్వెస్ట‌ర్ల సంప‌ద‌ను తుడిచి పెట్టి , ప్ర‌భుత్వంపై తీవ్ర దాడుల‌కు పాల్ప‌డిన అదానీ గ్రూప్ పై వ‌చ్చిన మోసం ఆరోప‌ణ‌ల ప‌త‌నాన్ని ప‌రిశీలించేందుకు న్యాయ‌మూర్తితో స‌హా నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని కోర్టు గ‌త వారం కేంద్రాన్ని కోరింది. ఇదిలా ఉండ‌గా అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ సంస్థ చేసిన ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధార‌మ‌ని పేర్కొంది అదానీ గ్రూప్. ఇది భార‌త దేశంపై జ‌రిగిన దాడిగా అభివ‌ర్ణించింది.

దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ఇది ఏర‌క‌మైన దాడో చెప్పాల‌ని నిల‌దీసింది. ఈ సంద‌ర్భంగా సీజేఐ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ‌కు సీల్డ్ క‌వ‌ర్ వ‌ద్ద‌ని పేర్కొన్నారు. దీనిని అంగీక‌రిస్తే ఇది ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీగా ప‌రిగ‌ణించే అవకాశం ఉంది. నిర్ణ‌యం త‌మ‌కు వ‌దిలి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : సీజేఐ సీరియ‌స్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!