IPL Schedule 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్ సంబురం
పాత ఫార్మాట్ లోనే మెగా ఈవెంట్
IPL Schedule 2023 : మెగా ఈవెంట్ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ ను 2023 సంవత్సరానికి గాను విడుదల చేసింది బీసీసీఐ. ఈసారి కూడా పాత ఫార్మాట్ లోనే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 2 గ్రూపులు 12 స్టేడియాలలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయి.
తేదీ కూడా ఖరారు చేసింది బీసీసీఐ. ఈ మేరకు మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ , చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది.
లీగ్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 70 మ్యాచ్ లు(IPL Schedule 2023) గ్రూప్ దశలో కొనసాగుతాయి. మూడు ప్లే ఆఫ్ లు , ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మైదానాల పరంగా చూస్తే లీగ్ మ్యాచ్ లు హైదరాబాద్ , లక్నో, మొహాలీ, అహ్మదాబాద్ , బెంగళూరు, చెన్నై , ఢిల్లీ, కోల్ కతా , జైపూర్ , ముంబై , గౌహతి, ధర్మశాల ఉన్నాయి.
రెండు గ్రూప్ లుగా విభజించింది బీసీసీఐ. ఒక్కో గ్రూప్ లో 5 జట్లు ఆడతాయి. గ్రూప్ – ఎ లో రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్ -బిలో సన్ రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ కింగ్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. పాయింట్ల ఆధారంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి.
Also Read : ఆర్సీబీ స్కిప్పర్ గా స్మృతి మంధాన