Amit Shah Uddhav Thackeray : ఠాక్రే పై భ‌గ్గుమ‌న్న అమిత్ షా

ఒప్పందానికి తూట్లు పొడిచారు

Amit Shah Uddhav Thackeray : మొద‌టిసారి తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. కేంద్ర ఎన్నికల సంఘం కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు. గ‌తంలో పార్టీకి సంబంధించి ఉన్న విల్లు, బాణం గుర్తును శివ‌సేన రెబ‌ల్ వ‌ర్గానికి చెందిన సీఎం షిండే వ‌ర్గానికి కేటాయిస్తూ నిర్ణ‌యించింది. 

దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే. ఇది పూర్తిగా రాజ‌కీయ హింస‌కు ప్ర‌తీక అని ఆరోపించారు. అంతే కాదు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి దాసోహ‌మైంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఉద్ద‌వ్ ఠాక్రే చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు అమిత్ షా. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్రంగా ఉంటుంద‌ని ఆ విష‌యం తెలియ‌కుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగానే ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో గ‌తంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాన్ని కావాల‌నే శివ‌సేన విస్మ‌రించింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి. అన్నింటిని ప‌రిశీలించిన త‌ర్వాతే ఈసీ నిర్ణ‌యం తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు.

ప్ర‌జ‌ల‌కు కూడా ఏది నిజ‌మైన శివ‌సేన పార్టీ అనేది తెలిసి పోయింద‌న్నారు అమిత్ చంద్ర షా. వ్య‌తిరేక భావ‌జాలం ఉన్న వారికి ప్ర‌పంచం అంతా వ్య‌తిరేకంగానే క‌నిపిస్తుంద‌ని ఎద్దేవా చేశారు. సైద్ధాంతిక పునాదుల మీదుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు సీఎం ప‌ద‌విని పంచు కోవ‌డంపై ఎటువంటి ఒప్పందం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అమిత్ షా(Amit Shah Uddhav Thackeray).

Also Read : ‘గ‌వ‌ర్నర్లు’ ల‌క్ష్మ‌ణ రేఖ దాటితే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!