PM Modi Chintan Shivir : అప్ డేట్ అయితేనే అందుకోగలం – మోదీ
చింతన్ శివర్ లో ప్రధానమంత్రి
PM Modi Chintan Shivir : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఏ రంగానికి చెందిన వారైనా రాణించాలంటే ముందుగా కష్టపడటం, సవాళ్లను స్వీకరించే స్థైర్యాన్ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అంతే కాదు మారుతున్న ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలని దానికి అనుగుణంగా మనల్ని మనం సరిదిద్దుకున్నప్పుడే సక్సెస్ కాగలమని చెప్పారు నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చింతన్ శిశిర్ కు ప్రధానమంత్రి(PM Modi Chintan Shivir) హాజరయ్యారు.
సినర్జీ, పాలనా దృష్టిని మెరుగు పర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కేంద్రం ఇటువంటి సెషన్ లను నిర్వహిస్తూ వస్తోంది. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు చింతన్ శివిర్ లో పాల్గొన్నారు. వారితో నరేంద్ర మోదీ స్వయంగా సంభాషించారు. వారు అందించిన సూచనలు స్వీకరించారు.
ఉన్నతాధికారులతో పాటు శిక్షణ శాఖకు చెందిన సీనియర్లు కూడా పాల్గొన్నారు. బ్రెయిన్ స్టామింగ్ అనేది నిరంతరం జరగాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. మన జీవితంలో , పని చేస్తున్న శాఖల్లో, రంగాలలో నిత్యం సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఒత్తిడి సహజం. అలా అని మనం దానిపైనే ఫోకస్ పెడితే చేస్తున్న పనిలో ఫోకస్ కోల్పోతాం.
అందుకే ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు, ఆయా రంగాలలో సక్సెస్ అయిన వాళ్లు ఎలాంటి పద్దతులను అవలంభించారనే దానిపై అవగాహన చింతన్ శివిర్ ద్వారా ఏర్పడుతుందని చెప్పారు నరేంద్ర మోదీ.
Also Read : శివుడు దయగల దేవుడు – ద్రౌపది ముర్ము