Coal Scam ED Raids : కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై ఈడీ దాడులు

బొగ్గు కుంభ‌కోణం కేసులో ద‌ర్యాప్తు సంస్థ దూకుడు

Coal Scam ED Raids : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దూకుడు పెంచాయి. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను, పార్టీల‌ను, వ్య‌క్తుల‌ను, సంస్థ‌లను టార్గెట్ చేస్తున్నాయి. సోమ‌వారం బొగ్గు కుంభ‌కోణానికి సంబంధించి ఛ‌త్తీస్ గ‌ఢ్ లో కాంగ్రెస్ నేత‌ల‌పై ద‌ర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేప‌ట్టింది. రాష్ట్ర రాజ‌ధాని రాయ్ పూర్ లో ఫిబ్ర‌వరి 24, 26 వ‌ర‌కు మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీన‌రీ స‌మావేశానికి ముందు ఈ దాడులు జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

సీఎం భూపేష్ బ‌ఘెల్ ఆధ్వ‌ర్యంలో స‌ర్కార్ న‌డుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఆస్తుల‌తో స‌హా డ‌జ‌నుకు పైగా స్థానాల్లో సోదాలు జ‌రుగుతున్నాయి. ఇదంతా క‌క్ష సాధింపు ధోర‌ణి త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. బొగ్గు లెవీ మ‌నీ లాండరింగ్ కేసులో కొన‌సాగుతున్న ద‌ర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు(Coal Scam ED Raids) చేప‌ట్టింది. ఇందులో కాంగ్రెస్ నేత‌ల‌కు సంబంధించిన స్థ‌లాలు ఉన్నాయ‌ని ఈడీ ప్ర‌క‌టించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌తో పాటు నేత‌లకు సంబంధించిన ప్రాంగ‌ణాల‌తో స‌హా డ‌జ‌నుకు పైగా లొకేష‌న్ ల‌లో శోధిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన బొగ్గు కుంభ‌కోణంలో నేరాల ద్వారా ల‌బ్ది పొందిన వారిపై ఈడీ విచార‌ణ జ‌రుపుతోంద‌ని పేర్కొంది.

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో సీనియ‌ర్ బ్యూరోక్రాట్లు, వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు , మ‌ధ్య‌వ‌ర్తుల‌తో కూడిన కార్టెల్ ద్వారా రవాణా చేసిన ప్ర‌తి ట‌న్ను బొగ్గుపై రూ. 25 అక్ర‌మ లెవీ వ‌సూలు చేయ‌బ‌డే భారీ కుంభ‌కోణానికి సంబంధించింద‌ని ఏజెన్సీ ఆరోపించింది.

Also Read : అరుణాచ‌ల్..మిజోరాం ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!