Australian PM Tour : భారత్ కు రానున్న ఆస్ట్రేలియా పీఎం
4వ టెస్టును కలిసి చూడనున్న పీఎంలు
Australian PM Tour : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వచ్చే నెల మార్చిలో భారత్ లో అధికారికంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భారత, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ ను ఇద్దరూ కలిసి వీక్షిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన ఇంకా చేయాల్సి ఉంది.
ఇప్పటికే భారత దేశం జి20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా కూడా భాగస్వామిగా ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు , కీలకమైన ఖనిజాలతో సహా అనేక రంగాలలో మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Australian PM Tour) ఇక్కడికి రానున్నారు. అల్బనీస్ టూర్ మార్చి 8 నాటికి ప్రారంభం అవుతుందని , మోదీతో కలిసి టెస్టు మ్యాచ్ చూసేందుకు హాజరు కానున్నారు.
మార్చి 9 నుంచి 13 వరకు నాలుగో టెస్టు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనుంది. ఇదిలా ఉండగా గత ఏడాది మేలో అల్బనీస్ ప్రధాని అయిన తర్వాత భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆసిస్ పీఎం భారత పర్యటనకు సిద్దం కావడానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) గత వారం ఆస్ట్రేలియా సందర్శించారు.
వచ్చే నెలలో నా భారత టూర్ కు ముందు కలవడం చాలా అద్భుతంగా ఉంది. మా వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక అవకాశాలు మన దేశాలను సుసంపన్నం చేసే దిశగా సాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఆస్ట్రేలియా పీఎం(Anthony Albanese).
Also Read : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్దం