Uddhav Thackeray Shivsena : ఇక శివ సైనికులు ఊరుకోరు – ఠాక్రే
మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్
Uddhav Thackeray Shivsena : మరాఠా రాజకీయంగా భగ్గుమంటోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ప్రశాంతంగా ఉన్న పాలిటిక్స్ లో చిచ్చు పెట్టేలా చేసింది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న అసాధారణ నిర్ణయం . శివసేన పార్టీకి సంబంధించి విల్లు బాణం గుర్తును తిరుగుబాటు బావుటా చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray Shivsena). ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఎన్నికల కమిషనర్లను ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని అన్నారు. తాము ఊరుకున్నా శివ సైనికులు ఊరుకోబోరంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒక వేళ తమ సైనికులు గనుక రంగంలోకి దిగితే సీన్ వేరుగా ఉంటుందన్నారు మాజీ సీఎం.
మరాఠాలో దట్టించిన తూటాల కంటే అత్యంత శక్తివంతమైన సైనికులు తమకు ఉన్నారని ఇది తమకు అంతులేని బలాన్ని ఇస్తుందన్నారు. ఈ సమయంలో పార్టీ పరంగా విల్లు, బాణం వేరే వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించాడు. త్వరలోనే తాను శివ సైనిక శిబిరాలను సంప్రదిస్తానని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
శివసేన(Shivsena) రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ కలిగి ఉందన్నారు. శివ శక్తి అభియాన్ లేదా పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. సోమవారం మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. మొత్తంగా ఉద్దవ్ ఠాక్రే చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి – ఠాక్రే