Joe Biden Tour : బైడెన్ ప్రత్యక్షం జెలెన్ స్కీ ఆశ్చర్యం
విస్తు పోయేలా చేసిన అమెరికా చీఫ్
Joe Biden Tour : ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden Tour). ఆయన సోమవారం ఉన్నట్టుండి ఉక్రెయిన్ లో ప్రత్యక్షం అయ్యాడు. మొదట్టి యుద్ద వార్షికోత్సవానికి ముందు ఆశ్చర్య పోయేలా చేశాడు. గత ఏడాది ఫిబ్రవరి 24న వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ లో ప్రత్యేక సైనిక కార్యకలాపాలను ప్రారంభించాడు. ఈ సందర్భంగా యుఎస్ చీఫ్ బైడెన్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లోదిమీర్ జెలెన్ స్కీతో కరచాలనం చేశారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి ఆకస్మిక పర్యటనతో రష్యా చీఫ్ పుతిన్ విస్తు పోయాడు. ఇదిలా ఉండగా బైడెన్ జెలెన్ స్కీ సతీమణి ఒలెనా జెలెన్ స్కీతో కూడా కలుసుకున్నారు. యుఎస్ చీఫ్ కు ఘన స్వాగతం పలికారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు. దేశంలోని మారన్కీ ప్యాలెస్ లో బైడెన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కైవ్ లో ఆకస్మిక పర్యటన చేయడం కలకలం రేపింది.
ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం , ప్రాదేశిక సమగ్రత పట్ల తన అచంచలమైన నిబద్దతను పునరుద్ఘాటించేందుకు కైవ్ లో ఉన్నానని స్పష్టం చేశారు అమెరికా చీఫ్ జో బైడెన్(Joe Biden Tour). రష్యా దండయాత్ర చేసిన దాదాపు ఒక ఏడాది తర్వాత బైడెన్ ఆకస్మిక పర్యటన మద్దతుకు కీలకమైన సంకేతంగా జెలెన్ స్కీ ప్రశంసించారు.
జోసెఫ్ బైడెన్ కైవ్ సాదర స్వాగతం పలుకిందని స్పష్టం చేశారు ఉక్రెయిన్(Ukraine) చీఫ్ జెలెన్ స్కీ. గత ఏడాదిలో యుఎస్ సైనిక, ఆర్థిక , మానవతా మద్దతుతో ఉక్రెయిన్ ను రక్షించడంలో సహాయం చేస్తామని ప్రకటించారు జో బైడెన్.
Also Read : భారత్ కు రానున్న ఆస్ట్రేలియా పీఎం