MK Stalin Slams : ఏబీవీపీ దాడిపై సీఎం స్టాలిన్ క‌న్నెర్ర‌

ఊరుకోబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్

MK Stalin Slams : డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సీరియ‌స్ అయ్యారు. ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాల‌యంలో చ‌దువుకుంటున్న త‌మిళ‌నాడుకు చెందిన విద్యార్థుల‌పై ఏబీవీపీకి చెందిన స‌భ్యులు దాడికి పాల్ప‌డ్డారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని యూనివ‌ర్శిటీ వీసీని కోరారు. ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు సీఎం ఎంకే స్టాలిన్.

కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల గురించి ఎవ‌రు మాట్లాడినా వారిని టార్గెట్ చేస్తున్నార‌ని, దాడికి పాల్ప‌డుతున్నారంటూ ఆరోపించారు త‌మిళ‌నాడు సీఎం(MK Stalin Slams). విద్యార్థుల‌పై హింసాత్మ‌కంగా మూగ ప్రేక్ష‌కులుగా మారుస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇంత జ‌రుగుతున్నా ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు సీఎం. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణిని తెలియ చేస్తోంద‌న్నారు.

ఫిబ్ర‌వ‌రి 19 ఆదివారం ఢిల్లీలోని జేఎన్ యూ లో ఏబీవీపీకి చెందిన స‌భ్యులు త‌మిళ‌నాడుకు చెందిన విద్యార్థుల‌పై దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సీఎం సీరియ‌స్ గా స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తించారు. ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎంకే స్టాలిన్. పెరియార్ , కార్ల్ మార్క్స్ త‌దిత‌ర గొప్ప నాయ‌కుల ఫోటోల‌ను ధ్వంసం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇందుకు సంబంధించి యూనివ‌ర్శిటీ అడ్మిన్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin Slams).

Also Read : పెరియార్..కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం

Leave A Reply

Your Email Id will not be published!