Supreme Court Approves : ఠాక్రే అభ్యర్థనకు ‘సుప్రీం’ ఓకే
ఈసీ గుర్తు కేటాయింపుపై కోర్టుకు
Supreme Court Approves : శివసేన పార్టీకి చెందిన విల్లు..బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం. ఏక్ నాథ్ షిండే శిబిరాన్ని అడ్డుకోవాలని దావాలో పేర్కొంది. శివసేన పార్టీకి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోకుండా ఏక్ నాథ్ షిండే శిబిరాన్ని నిరోధించాలని కోరుతూ న్యాయస్థానాన్ని కోరారు.
ఉద్దవ్ ఠాక్రే చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు అంగీకరించడం(Supreme Court Approves) విశేషం. ముంబై లోని దాదార్ లోని శివసేన భవన్ లో ఉద్దవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. విచారణకు అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయ స్థానం. ఉద్దవ్ ఠాక్రే తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి శివసేన పేరును, పార్టీ చిహ్నమైన విల్లు, బాణం గుర్తును ఉపయోగించుకునే హక్కును కల్పించింది.
గత వారం ఇచ్చిన ఎన్నికల కమిషన్ తీర్పుపై స్టే విధించాలని కపిల్ సిబల్ కోరారు. షిండే క్యాంప్ ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈ అంశాన్ని మొదటి సందర్భంలో సుప్రీంకోర్టు విచారించ కూడదని కోరింది. శివసేన నుంచి వేరు పడిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండే వైపు మొగ్గారు. దీంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు.
కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో నిర్ణయం తీసుకుందని ఆరోపించారు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. మోదీ ప్రభుత్వానికి దాసోహమైందని మండిపడ్డారు.
Also Read : పార్టీ గుర్తు వెనుక కేంద్రం కుట్ర – రౌత్