Putin Blames : పాశ్చత్య దేశాలు ఎగదోస్తున్నాయి – పుతిన్
అమెరికా, యూరోపియన్ కంట్రీస్ పై ఫైర్
Putin Blames : రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్ పై యుద్దం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సమస్య స్థానికానికి సంబంధించింది. కానీ పాశ్చాత్యా దేశాలు ప్రధానంగా అమెరికా, యూరోపియన్ కంట్రీస్ కావాలని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు పుతిన్. దశల వారీగా తాము ఎదుర్కొంటున్న లక్ష్యాలను జాగ్రత్తగా , క్రమ పద్దతిలో పరిష్కరిస్తామని ప్రకటించారు.
పుతిన్ సైనిక జోక్యం మొదటి వార్షికోత్సవానికి ముందు ప్రకటించడం కలకలం రేపింది. అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉక్రెయిన్ లో కాలు మోపాడు. ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీతో కరచాలనం చేశారు. ఆపై సైనిక, ఆర్థిక మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించాడురష్యా చీఫ్ పుతిన్(Putin Blames). పాశ్చాత్య ప్రముఖులు తమతో ఒక్కసారిగా పూర్తి చేయాలని అనుకుంటున్నారంటూ ఆరోపించారు.
ఉక్రెయిన్ లో మాస్కో దాడిని క్రమబద్దంగా ముందుకు తీసుకు వెళతానని ప్రతిజ్ఞ చేశారు రష్యా ప్రెసిడెంట్. ఉక్రెయిన్ సంఘర్షణకు ఆజ్యం పోసే బాధ్యత, దాని తీవ్రతరం , బాధితుల సంఖ్య అంతా పూర్తిగా పాశ్చాత్య ప్రముఖులపై ఉందన్నారు. పుతిన్ రష్యా ఉన్నతాధికారులతో ,రాజకీయ ప్రముఖులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు .
పాశ్చాత్య దేశాలు స్థానిక సంఘర్షణను ప్రపంచ ఘర్షణగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యుఎస్ చీఫ్ బైడెన్ రహస్యంగా పర్యటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తనతో పెట్టుకుంటే బాగుండదని హెచ్చరించారు రష్యా చీఫ్ పుతిన్.
Also Read : మోదీ ఫోన్ చేసే దాకా తెలియదు – జై శంకర్