Wipro Cuts Freshers : విప్రో వాత వేత‌నాల్లో కోత

భ‌గ్గుమంటున్న ఫ్రెష‌ర్స్

Wipro Cuts Freshers : ప్ర‌పంచ ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు అన్ని రంగాలు వ‌ణుకుతున్నాయి. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా , టెలికాం, త‌దిత‌ర సెక్టార్ల‌న్నీ వేలాది మందిని సాగ‌నంపుతున్నాయి. ఎంప్లాయిస్ పై వేటు వేసింది మొద‌ట టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్. దెబ్బ‌కు మిగ‌తా కంపెనీలు త‌గ‌దున‌మ్మా అంటూ తీసివేత స్టార్ట్ చేశాయి. గూగుల్ , మైక్రోసాఫ్ట్, మెటా ఫేస్ బుక్, అమెజాన్ , ఫిలిప్స్ , త‌దిత‌ర కంపెనీలు ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్ష మందికి పైగా తొల‌గించాయి.

తాజాగా మ‌రో భార‌తీయ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అజీమ్ ప్రేమ్ జీ నేతృత్వంలోని విప్రో కోలుకోలేని షాక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే ఫ్రెష‌ర్స్ కు సంబంధించిన వ‌తేనాల‌కు సంబంధించి 50 శాతం కోత(Wipro Cuts Freshers) విధించింది. ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. తొల‌గించ‌డం లేద‌ని కానీ జీతాలు అంత‌గా ఇవ్వ‌లేమంటూ ప్ర‌క‌టించింది. దీనిపై ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే విప్రో ఉద్యోగులంద‌రి ఎదుగుద‌ల‌కు , విజ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉందంటూ మండిప‌డింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్ బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ప్రెష‌ర్ల‌కు జీతాల ఆఫ‌ర్ల‌ను త‌గ్గించే చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ఐటీ ఎంప్లాయిస్ యూనియ‌న్ నిప్పులు చెరిగింది. ఇది ఒక ర‌కంగా భార‌తీయ చ‌ట్టాల‌ను నిర్వీర్యం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా మొద‌ట‌గా ఫ్రెష‌ర్స్ కు రూ. 6.5 ల‌క్ష‌ల ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత రూ. 3.25 కు తగ్గించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది.

Also Read : గూగుల్ వేటు కొత్త కంపెనీ స్టార్ట్

Leave A Reply

Your Email Id will not be published!