Supreme Court Relief : అస్సాం ఎమ్మెల్యేకు సుప్రీం ఊరట
అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశం
Supreme Court Assam MLA : పౌరసత్వ చట్టం నిరసనతో సంబంధం ఉన్న కేసులో అస్సాం ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ కు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఊరటనిచ్చింది(Supreme Court Assam MLA). సీఎఎ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల సందర్భంగా గొగోయ్ కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇదిలా ఉండగా అఖిల్ గొగోయ్ అస్సాం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు.
సిఎఎ వ్యతిరేక నిరసనలు, అనుమానిత మావోయిస్టు సంబంధాలకు సంబంధించిన కేసుకు సంబంధించి ఎమ్మెల్యేకు రక్షణ కల్పించింది. ఎలాంటి అరెస్ట్ చేయొద్దంటూ సీరియస్ గా ఆదేశించింది. ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. ఇదిలా ఉండగా అఖిల్ గొగోయ్ అభ్యర్థనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నుండి ప్రతిస్పందనను కోరింది.
పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనల సందర్బంగా మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పాడు . దీనికి సంబంధించి అసోం లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుపై అభియోగాల రూపకల్పనను కొనసాగించేందుకు అనుమతినిస్తూ గౌహతి హైకోర్టు ఫిబ్రవరి 9న ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.
ఫిబ్రవరి 24, 2023న రిటర్న్ చేయబడే ఇంప్యూర్డ్ ఆర్డర్ ప్రకారం పిషనర్ కు అరెస్ట్ నుండి రక్షణ మంజూరు చేయడాన్ని పరిగణలోకి తీసుకునే పరిమిత ప్రయోజనం కోసం రాష్ట్ర ఎన్ఐఏ తరపున స్టాండింగ్ కౌన్సెల్ కి నోటీసు అందజేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు(Supreme Court Relief).
న్యాయమూర్తులు వి. రామసుబ్రమణియన్ , పంకజ్ మిథాల్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట సభ సభ్యుల తరపున సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదనలు వినిపించారు.
Also Read : ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ సారథ్యం