Arvind Kejriwal : గూండాలు ఓడి పోయారు – కేజ్రీవాల్
ఆప్ వశమైన ఢిల్లీ మేయర్ పీఠం
Arvind Kejriwal Delhi Mayor Results : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కు చెందిన షెల్లీ ఒబేరాయ్ 34 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన రేఖా గుప్తాపై ఘన విజయాన్ని సాధించారు. మేయర్ గా తమ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందడంతో ఆప్ లో సంబురాలు మిన్నంటాయి. విజయం సాధించిన అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Delhi Mayor Results) మీడియాతో మాట్లాడారు.
ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. ఎలాగైనా సరే అక్రమ పద్దతుల్లో అడ్డంకులు సృష్టించాలని అనుకున్నారని, కానీ వారి ఆటలు సాగలేదన్నారు. అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఇంకా ఈ దేశంలో న్యాయం బతికే ఉందని నిరూపించినందుకు భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ డిల్లీ మేయర్ , డిప్యూటీ మేయర్, నామినేటెడ్ సభ్యుల ఎంపిక రసాభాసగా మారింది.
ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడింది. చివరకు షెల్లీ ఒబేరాయ్( Shelly Oberoi) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. కేసును విచారించిన కోర్టు చివరకు వారికి ఓటు హక్కు ఉండదని, ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని తీర్పు చెప్పింది సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు. ఎలాగైనా సరే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసింది. కానీ చివరకు డంగై పోయింది.
Also Read : ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్