Rahul Gandhi : బీజేపీ గెలుపు కోసం టీఎంసీ ప్ర‌య‌త్నం

కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ

Rahul Gandhi TMC : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు. బుధ‌వారం షిల్లాంగ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీని(Rahul Gandhi TMC) కూడా ఏకి పారేశారు. కేవ‌లం బీజేపీని గెలిపించేందు కోసం టీఎంసీ ప్ర‌య‌త్నం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పైకి కేసులు, ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. మోదీ భ‌యానికి అటు ఎంఐఎం ఇటు టీఎంసీ పార్టీలు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తున్నాయంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

ప్ర‌స్తుతం కేవ‌లం అధికారం కోసం కాకుండా టీఎంసీ బీజేపీని గెలిపించేందుకే బ‌రిలోకి దిగిందంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు. బీజేపీ ఒక క్లాస్ రౌడీ లాగా త‌న‌కు అన్నీ తెలుసున‌ని భావిస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్ర‌వ‌రి 27న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి రాహుల్ గాంధీ మేఘాల‌య వెళ్లారు. త‌న‌కు అన్నీ తెలుసున‌ని భావించే బీజేపీ ఎవ‌రినీ గౌర‌వించ‌ద‌ని జోష్యం చెప్పారు. అది త‌ర‌గ‌తి రౌడీ కంటే అధ్వాన్నంగా ప్ర‌వ‌ర్తిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తోందంటూ టీఎంసీని తూర్పార‌బ‌ట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉండే దేనిని అంగీక‌రించ‌రంటూ సీరియ‌స్ అయ్యారు. మేఘాల‌య భాష‌, సంస్కృతి, చ‌రిత్ర‌కు హాని క‌లిగించే బీజేపీని కాంగ్రెస్ పార్టీ అనుమ‌తించ బోద‌న్నారు. టీఎంసీ పాల‌న పూర్తిగా రాచ‌రిక పాల‌న‌ను గుర్తుకు తెస్తోంద‌ని ఆరోపించారు.

Also Read : ప్ర‌తిప‌క్ష కూట‌మికి కాంగ్రెస్ సార‌థ్యం

Leave A Reply

Your Email Id will not be published!