Rahul Gandhi : అదానీ మోదీ లింకు ఏమిటో చెప్పాలి
డిమాండ్ చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi Adani Link : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బుధవారం షిల్లాంగ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గత కొన్నేళ్ల నుంచి గౌతం అదానీతో ప్రధాన మంత్రికి ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని రాహుల్ గాంధి(Rahul Gandhi Adani Link) డిమాండ్ చేశారు.
ఇప్పుడు కాదు 2014 నుంచి పవర్ లోకి వచ్చినప్పటి నుంచి తాను అడుగుతూనే ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. 2014 కంటే ముందు గౌతం అదానీ ప్లేస్ 609వ స్థానంలో ఉండగా ఎలా 2వ స్థానంలోకి వచ్చాడని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి మోదీ విదేశాలకు వెళ్లినప్పుడల్లా అదానీకి బహుమానం అందుతుందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాధానాలు ఇప్పటికీ లేవన్నారు రాహుల్ గాంధీ.
మేఘాలయలో టీఎంసీ కావాలని బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ ఆరోపించారు. పీడీఎస్ కోసం ఉద్దేశించిన దాదాపు లక్ష బస్తాల బియ్యం అస్సాంలో కనుగొనడం జరిగిందన్నారు. బొగ్గు కుంభకోణంకు సంబంధించి 13 క్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అక్రమంగా తవ్వారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
అదానీ, మోదీకి సంబంధించిన మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. ఇప్పటికే దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను పూర్తిగా అదానీకి ఎలా అప్పగించారంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దీనికి సమాధానం చెప్పి తీరాలన్నారు. రాహుల్ గాంధీ లేవదీసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో లేరు ప్రధానమంత్రి.
Also Read : బీజేపీ గెలుపు కోసం టీఎంసీ ప్రయత్నం