Pathan Movie Comment : పఠాన్ మామాజాలం కలెక్షన్ల వర్షం
బాద్ షా మ్యాజిక్ దీపికా కిరాక్
Pathan Movie Collections Comment : బాక్సులు బద్దలవుతున్నాయి అంటే ఏమిటో ఇప్పుడు బాద్ షా ను చూస్తే తెలుస్తుంది. ఆద్యంతమూ వివాదాలతో మొదలై చివరకు రూ. 1,000 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది షారుక్ ఖాన్ , దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ మూవీ.
జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. స్టార్టింగ్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వెనక్కి చూసేంత తీరిక కూడా లేక పోయింది చిత్ర యూనిట్ కు. గత కొంత కాలంగా భారతీయ సినిమా వెలుగుతోంది.
మరో వైపు కళాత్మక సినిమాలతో పాటు యాక్షన్ , డ్రామా, క్రైమ్ , రొమాన్స్ తో కూడుకున్న చిత్రాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి గత కొంత కాలం నుంచి దక్షిణాదికి చెందిన చిత్రాలు డామినేట్ చేస్తూ వచ్చాయి. అందులో ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ -2 , ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాలు రూ. 1, 000 కోట్ల మార్క్ ను ఎప్పుడో దాటేశాయి.
ఇక బాలీవుడ్ లో కొంత కాలం చెప్పుకో దగిన సినిమాలు అంతగా పాపులర్ కాలేదు. విచిత్రం ఏమిటంటే షారుక్ ఖాన్ కెరీర్ లో గుర్తుంచుకునేలా నిలిచి పోయేలా చేసింది పఠాన్. నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత నటించాడు. తనకు కూడా సినిమా ఆడుతుందో లేదోనన్న అపనమ్మకం కూడా ఉంది.
ఇదే సమయంలో ఈ గ్యాప్ లో తను కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రాణ ప్రాదంగా ప్రేమించే కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం కూడా షారుక్ ఖాన్ ను మరింత టార్చర్ కు గురి చేసింది. సినిమాలో హీరో అయినా కెరీర్ పరంగా ఒడిదడుకులు ఉన్నాయి.
ఈ తరుణంలో ఎనలేని శక్తిని ఇచ్చేలా చేసింది పఠాన్. స్పై, యాక్షన్ , డ్రామా మేలవించి దర్శకుడు తెరకెక్కించాడు. దెబ్బకు ప్రపంచ మంతా పఠాన్ కు ఫిదా అయ్యింది. అభిమానులు అంతులేని ప్రేమను చాటుకున్నారు.
విడుదలైన నాటి నుంచి నేటి దాకా కలెక్షన్లు రాబడుతూనే ఉంది పఠాన్(Pathan Movie Collections). విజయోత్సవ యాత్రలు చేస్తోంది చిత్ర బృందం.
ఇదే సమయంలో దీపికా పదుకొనేకు కూడా ఆశించిన సక్సెస్ రాలేదు. అందుకేమో పఠాన్ విజయాన్ని చూసి తట్టుకోలేక పోయింది. వేదికపైనే కన్నీటి పర్యంతమైంది. బహుషా కళాకారులకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది.
మొత్తంగా షారుక్ ఖాన్ లోని నటనను, దీపికాలోని ఈజ్ ను దర్శకుడు ఇట్టే పసిగట్టాడు. అందుకే అంత బాగా తీయగలిగాడు. ఇళ్లల్లో ఉన్న జనాలను థియేటర్లకు రప్పించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఒక రకంగా పఠాన్ సాధించిన ఈ అపూర్వమైన విజయం నిస్సత్తువతో ఉన్న బాలీవుడ్ కు ఓ టానిక్ లాగా పని చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ కు ఇది చిరస్మరణీయమైన గుర్తు గా ఉండి పోతుంది.
ఇక దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీగా(Pathan Movie Collections) నిలిచి పోతుంది. ఏది ఏమైనా చిత్ర యూనిట్ కే కాదు బాలీవుడ్ కు ఓ ఆక్సిజన్ నింపేలా చేసిందనడంలో సందేహం లేదు.
ఈ ఒక్క మూవీ కొట్టిన దెబ్బకు మరికొన్ని సినిమాలకు ప్రాణం పోసుకునేలా అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.
Also Read : గాయని నేహా సింగ్ కు నోటీసు