Neha Singh Rathore : గాయ‌ని నేహా సింగ్ కు నోటీసు

యూపీ స‌ర్కార్ పై ఫేమ‌స్ సాంగ్

Neha Singh Rathore : ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని యోగి స‌ర్కార్ ను, బుల్ డోజ‌ర్ త‌ర‌లింపును నిందిస్తూ పాట పాడినందుకు గాయ‌ని నేహా సింగ్ కు పోలీసులు నోటీసు పంపించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రంలో ప్ర‌శ్నించ‌డం నేరంగా మారిందంటూ విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. గాయ‌ని నేహా సింగ్ రాథోడ్(Neha Singh Rathore) ఇటీవ‌ల పాడిన యూపీ మే కా బా పాట యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపింది. పెద్ద ఎత్తున వైర‌ల్ గా మారింది. కాన్పూర్ లో నేహా సింగ్ తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేసింది.

అంతే కాదు నేహా సింగ్ రాథోడ్ ఇటీవ‌ల యూపీ మే కా బా సీజ‌న్ 2 పాట‌ను కూడా అప్ లోడ్ చేయ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. మొద‌టి పాట వైర‌ల్ కావ‌డంతో రెండో పాటను విడుద‌ల చేయ‌డం, అది కూడా టాప్ లోకి చేర‌డం విస్తు పోయేలా చేసింది. యోగి ఆదిత్యానాథ్ ప్ర‌భుత్వాన్న అవ‌హేళ‌న చేసినందుకు ప్ర‌ముఖ భోజ్ పురి సింగ‌ర్ కు యూపీ ఖాకీలు నోటీసులు ఇచ్చారు. ఈ పాట స‌మాజంలో అశాంతిని, ఉద్రిక్త‌త‌ను పెంచి పోషించిందంటూ పోలీసులు ఆరోపించారు. అందుకే నోటీసు ఇచ్చిన‌ట్లు తెలిపారు.

మూడు రోజుల స‌మ‌యం ఇచ్చామ‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌క పోతే అరెస్ట్ త‌ప్ప‌దంటూ హెచ్చరించారు. మీ స‌మాధానం సంతృప్తిక‌రంగా లేక పోతే కేసు న‌మోదు చేయ‌బ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా నేహా సింగ్ రాథోడ్ కు నోటీసు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ , ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

Also Read : మ‌ల‌యాళ న‌టి సుబి సురేష్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!