Actress Subi Suresh Died : మ‌ల‌యాళ న‌టి సుబి సురేష్ మృతి

కొంత కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స

Actress Subi Suresh Died : మ‌ల‌యాళ సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నటి , టెలివిజ‌న్ హోస్ట్ , స్టేజ్ షో పెర్ఫార్మ‌ర్ సుబీ సురేష్ బుద‌వారం మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 41 ఏళ్లు. యు టీవీలో మోస్ట్ పాపుల‌ర్ ప్ర‌యోక్త‌గా కూడా గుర్తింపు పొందారు సుబి సురేష్(Actress Subi Suresh Died) . చాలా చిన్న వ‌య‌స్సులోనే కాలం చేయ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది.

ఇటీవ‌లే సినీ రంగానికి చెందిన ప‌లువురు లోకాన్ని వీడారు. తెలుగు చిత్ర రంగానికి చెందిన ద‌ర్శ‌కులు కాశీనాథుని విశ్వ‌నాథ్, సాగ‌ర్ , న‌టుడు నంద‌మూరి తార‌క‌రత్న మ‌ర‌ణించారు. త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్ మ‌లియ్సామి క‌న్ను మూశారు. తాజాగా సుబి సురేష్ మృతి చెంద‌డంతో ఒక్క‌సారిగా చిత్ర ప‌రిశ్ర‌మ షాక్ కు గురైంది. ఆమె త‌న స్లాప్ స్టిక్ పాత్ర‌లు, స్పాంటేనియ‌స్ ఆన్ స్టేజ్ డైలాగ్ డెలివ‌రీకి ప్ర‌సిద్ది పొందారు.

సుబి సురేష్ గ‌త కొంత కాలంగా కొచ్చి లోని ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ వ్యాధితో బాధ ప‌డుతున్నారు. అటు బుల్లి తెర‌తో పాటు ఇటు వెండి తెర‌పై కూడా సుబీ సురేష్ కు మంచి పేరుంది. ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. కొన్నాళ్ల కింద‌ట కొచ్చిన్ క‌ళా భ‌వ‌న్ ట్రూప్ లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా త‌న కెరీర్ ను ప్రారంభించారు.

క్ర‌మంగా టెలివిజ‌న్ లో పురుషాధిక్య కామెడీ షోల‌లో త‌న‌కంటూ స‌ముచిత స్థానం సంపాదించుకున్నారు. త‌న అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది సుబి సురేష్.

Also Read : రూ. 1,000 కోట్లు దాటిన ప‌ఠాన్

Leave A Reply

Your Email Id will not be published!