Pathan Rs1000 Cr : రూ. 1,000 కోట్లు దాటిన ప‌ఠాన్

బాక్సాఫీస్ లు బ‌ద్ద‌లు కొట్టిన మూవీ

Pathan Rs1000 Cr : బాద్ షా షారుక్ ఖాన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన ప‌ఠాన్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. విడుద‌లైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుని క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1,000 కోట్ల‌ను(Pathan Rs1000 Cr) దాటేసింది. అరుదైన రికార్డ్ సృష్టించింది బాలీవుడ్ లో. ప‌ఠాన్ చిత్రం గ‌త జ‌న‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఇప్ప‌టికీ వ‌ర‌ల్డ్ వైడ్ గా థియేట‌ర్ల‌లో ఇంకా న‌డుస్తోంది.

2018లో విడుద‌లైన జీరో చిత్రం త‌ర్వాత నాలుగు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత బాద్ షా షారుక్ ఖాన్ వెండి తెర‌పైకి తిరిగి వ‌చ్చారు. ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. 2019లో వ‌చ్చిన వార్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సిద్దార్థ్ ఆనంద్ ప‌ఠాన్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో మంగ‌శారం వెయ్యి కోట్ల‌ను దాటిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన పోస్ట‌ర్ ను షేర్ చేసింది.

ప‌ఠాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా సూప‌ర్ గా న‌డుస్తోంది. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ 50తో ప‌ఠాన్ వేడుక‌ల‌ను మీరు పంచుకోమ‌ని కోరింది చిత్ర యూనిట్. హిందీ, త‌మిళం, తెలుగులో మ‌రోసారి ప‌ఠాన్ మూవీని చూడాల‌ని పిలుపునిచ్చింది. ర‌చ‌యిత శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ మాట్లాడారు. పాత‌, కొత్త పాత్ర‌ల‌తో స‌ర‌దాగా గూఢ‌చారి విశ్వాన్ని సృష్టించాల‌నేది త‌మ ఆశ‌. సినిమాకు రాయ‌డం చాలా ఆనందాన్ని క‌లిగించిద‌న్నారు. రాబోయే రోజుల్లో ప‌ఠాన్(Pathan Rs1000 Cr) ఇంకెన్ని కోట్లు కొల్ల‌గొడుతుందో చూడాలి.

Also Read : కచేరిలో సోనూ నిగ‌మ్ తోసివేత

Leave A Reply

Your Email Id will not be published!