AAP vs BJP Row : ఆప్ బీజేపీ సభ్యుల మధ్య తోపులాట
ఒకరిపై మరొకరు పిడి గుద్దులు..దాడులు
AAP vs BJP Row : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్యుల(AAP vs BJP Row) మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది మేయర్ , డిప్యూటీ మేయర్ , ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక.
చివరకు ఆప్ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఎల్జీ నియమించిన నామినేటెడ్ సభ్యులకు ఎలాంటి ఓటు హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత మధ్య ఎంసీడీకి మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షీలా మేయర్ గా, ఇక్బాల్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. అనంతరం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి సమావేశం జరిగింది. కానీ ఇరు వర్గాల మధ్య తోపులాట, దాడులతో (AAP vs BJP Row) దద్దరిల్లింది. దీంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేయర్. తిరిగి శుక్రవారం ఎన్నుకునేందుకు ప్రయత్నం చేసినా చివరకు తోపులాట, పిడి గుద్దులతో ముగిసింది. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన సభ్యులు ప్రవర్తించిన తీరు చర్చకు దారి తీసింది.
ఈ మొత్తం వ్యవహారంపై ఢిల్లీ వాసులు మండి పడుతున్నారు. ఎలా మెజారిటీ లేక పోయినా కీలక పదవులను దక్కించు కోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. చివరకు దాడులతో మరింత హీట్ ఎక్కేలా చేసింది. ఇక ఎంసీడీ స్టాండింగ్ కమిటీకి ఆరుగురు సభ్యుల ఎంపిక కోసం ఆప్ ఆధ్వర్యంలో 250 మంది సభ్యులకు గాను 242 మంది ఓటు వేశారు.
Also Read : సిసోడియాను అరెస్ట్ చేసే ఛాన్స్ – సీఎం