AIMIM Owaisi : పేర్లు మారిస్తే చరిత్ర మారదు – ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్
AIMIM Owaisi : ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక పేర్లు మార్చడం మొదలైందని ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. మహారాష్ట్ర లోని పేరు పొందిన రెండు ప్రధాన నగరాలు ఔరంగాబాద్ , ఉస్మానాబాద్ పేర్లను శంభాజీ నగర్ , ధరా శివ్ నగర్ గా మార్చారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐఎం చీఫ్. మరాఠాలో కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే , బీజేపీ సంకీర్ణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర చెరిగి పోదన్నారు అసదుద్దీన్ ఓవైసీ(AIMIM Owaisi).
ఇలా ఎన్ని పేర్లు మార్చుకుంటూ పోతారంటూ ప్రశ్నించారు. పీఎంను నిలదీశారు. ఎవరికి ఎలా ఉండాలో ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు నిర్ణయిస్తారని కానీ ప్రభుత్వం కాదన్నారు. ప్రధాన ప్రాంతాలుగా పేరొందిన వాటిని మార్చేకంటే ముందు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండాల్సిందన్నారు. ఏదో ఒక రోజు వాటిని కూడా మరో సర్కార్ మార్చే అవకాశం ఉంటుందన్నారు.
చారిత్రిక నగరాలతో పాటు పార్కులు, వారసత్వ కట్టడాలను కూడా మార్చుతూ పోతున్నారని ఇదేమని అడిగితే వాళ్లను కూడా దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారంటూ ఆరోపించారు. ఇవాళ సంఖ్యా బలం ఉందని మార్చుకుంటూ వెళితే పవర్ ఎప్పటి లాగే ఉంటుందని అనుకోవడం వట్టిదేనని పేర్కొన్నారు. కోర్టు కంటే తామే సుప్రీమ్ సందేశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిందన్నారు ఓవైసీ(AIMIM Owaisi).
Also Read : సీడబ్ల్యూసీకి ఎన్నికలు లేవు