CJI Chandrachud Concern : ఆత్మహత్యలపై సీజేఐ ఆందోళన
జీవితం అత్యంత ముఖ్యమైనది
CJI Chandrachud Concern Suicides : ఆత్మహత్యలకు పాల్పడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఇది అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. ఇటీవల ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి సూసైడ్ పాల్పడిన ఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాల బాధితులకు సంబంధించిన ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శతాబ్దాలుగా సూసైడ్స్ వద్దంటూ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు జస్టిస్ చంద్రచూడ్(CJI Chandrachud Concern Suicides). విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు మరింత పెరుగుతున్నాయని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. మన విద్యా సంస్థలు ఎక్కడ తప్పుతున్నాయో అక్కడ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తనను విస్తు పోయేలా చేస్తోందని అన్నారు.
హైదరాబాద్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్ ) లో జరిగిన కాన్వొకేషన్ లో పాల్గొని ప్రసంగించారు. సామాజిక మార్పు కోసం ముందుకు రావడానికి కోర్టు గదుల లోపల , వెలుపల సమాజంతో సంభాషణలు చేయడంలో దేశంలోని న్యాయమూర్తులది కీలకమైన పాత్ర అన్నారు జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ . విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని వదులు కోవాల్సి వస్తుందన్నారు.
అట్టడుగు వర్గాల నుండి ఆత్మహత్యల సంఘటనలు సర్వ సాధారణం అవుతున్నాయి. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు. అవి కొన్ని సార్లు శతాబ్దాల పోరాట కథలు..మనం ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే మొదటి దశను గుర్తించడం అని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు.
Also Read : కొలువుల కోతపై ఎరిక్‌సన్ ఫోకస్