Congress Plenary : థర్డ్ ఫ్రంట్ వల్ల బీజేపీకి లాభం
కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం
Congress Plenary Session : మూడవ ఫ్రంట్ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని అభభిప్రాయ పడింది పార్టీ. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరుగుతున్న 85వ కాంగ్రెస్ ప్లీనరీ(Congress Plenary Session) కీలక నిర్ణయం తీసుకుంది. మేధోమథన సదస్సులో థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఎన్నికల్లో మాత్రమే సాయ పడుతుందని పేర్కొంది. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పోరాడేందుకు భావ సారూప్యత కలిగిన లౌకిక పార్టీలను కాంగ్రెస్ గుర్తించి సమీకరించాలని స్పష్టం చేసింది.
విపక్షాల ఐక్యత కోసం ఆ పార్టీ ఇవాళ తాజా ఒత్తిడిలో పేర్కొంది. లౌకిక, సామ్యవాద శక్తుల ఐక్యత కాంగ్రెస్ పార్టీకి ముఖ్య లక్షణం. కాంగ్రెస్ భావజాలం గల లౌకిక శక్తులను గుర్తించి సమీకరించేందుకు అన్ని విధాలుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. పార్టీ భావజాలంతో ఏకీభవించే లౌకిక ప్రాంతీయ శక్తులను కలుపుకోవాలి. ఉమ్మడి సైద్ధాంతిక ప్రాతిపదికన ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ఐక్య ప్రతిపక్షం తక్షణ అవసరం.
ఏదైనా మూడవ శక్తి ఆవిర్భావం బీజేపీకి లాభదాయకంగా మాత్రమే ఉంటుందని గుర్తు చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ఇది ఎంతమాత్రం ఆహ్వానించ తగిన విషయం కాదని వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు కాంగ్రెస్ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులలో దేశంలో సమర్థమైన , నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ .
ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో సమర్థవంతమైన , నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించ కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
Also Read : జోడో యాత్ర ఆధారంగా డాక్యుమెంట్