BJP Slams Congress : ఆత్మ పరిశీలన లేని కాంగ్రెస్ ప్లీనరీ
నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ
BJP Slams Congress : ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీపై కీలక కామెంట్స్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఇదే సమయంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదన్నారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారత్ జోడో యాత్రను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ 2024 కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఆదేశించారు సోనియా గాంధీ. ఈ సందర్భంగా బీజేపీ సీరియస్ గా స్పందించింది. 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ లో ఎలాంటి ఆత్మ పరిశీలన చేసుకోలేదని ఆరోపించింది. ఎంత సేపు బీజేపీని తిట్టడంపైనే కాంగ్రెస్ ప్లీనరీ ఫోకస్ పెట్టిందని మండిపడింది.
ఆరోపణలు చేసినంత మాత్రాన, విమర్శలు చేసినంత కాలం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించరని తిరిగి సార్వత్రిక ఎన్నికల్లో తామే పవర్ లోకి వస్తామని బీజేపీ ప్రకటించింది. తమ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని , కానీ గతంలో ఏలిన కాంగ్రెస్ దేశాన్ని సర్వ నాశనం చేసిందంటూ ఆరోపించింది.దేశ ప్రజలు ఆదరించక పోతే కేంద్ర ఎన్నికల కమిషన్ ను తప్పు పడితే ఎలా అని ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ(BJP Slams Congress). కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.
Also Read : కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి