Anurag Thakur : పాశ్చాత్య మనస్తత్వానికి చెక్ – ఠాగూర్
కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
Anurag Thakur Slams : కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur Slams) నిప్పులు చెరిగారు. ఆయన 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. గత 70 సంవత్సరాలుగా ఈ దేశంపై పాశ్చాత్య మనస్తత్వం బలవంతంగా రుద్ద బడిందన్నారు. హిండెన్ బర్గ్ నివేదిక, బిలియనీర్ , ఇతర మార్గాలను ఉపయోగించి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు కొనసాగుతున్నాయని యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అనురాగ్ ఠాకూర్.
లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మన దేశానికి సంబంధించిన వారసత్వం, చరిత్ర, కళ, సంస్కృతి , సంప్రదాయం ఎంతో గొప్పది. దీని గురించి మనందరం గర్వపడాలన్నారు కేంద్ర మంత్రి. పాశ్చాత్య దేశాల మనస్తత్వాన్ని తొలగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు మారుతున్నాయని అన్నారు అనురాగ్ ఠాకూర్. ధనేలి గ్రామంలొని రావత్ పురా సర్కార్ విశ్వ విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్ర సంస్థాన్ ఛత్తీస్ గఢ్ యూనిట్ నిర్వహించిన యువ సంవాద్ ఇండియాలో పాల్గొని ప్రసంగించారు.
అయితే పేరుకు పోయిన ఈ మనస్తత్వాన్ని లేకుండా చేసేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి. రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా తొలగి పోతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఇవాళ అద్భుతమైన సోమనాథ్ ధామ్ , కాశీ ధామ్ , కేదారనాథ్ ధామ్ , మహా కాల్ ధామ్ లను నిర్మించామన్నారు. వచ్చే ఏడాది అయోధ్య రామ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు ఠాకూర్(Anurag Thakur).
Also Read : ఆత్మ పరిశీలన లేని కాంగ్రెస్ ప్లీనరీ