Bhagwant Mann : వాళ్లు వార‌సులు కాలేరు – మాన్

గురుగ్రంథ్ సాహిబ్ పై కామెంట్స్

Bhagwant Mann Ajanala incident : గురు గ్రంథ్ సాహిబ్ ను విశ్వ‌సించే వారు హింస‌ను కోరుకోర‌ని అన్నారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్. వారిస్ పంజాబ్ దే అనే సంస్థ‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఖ‌లిస్తాన్ సానుభూతిప‌రుడు అమృత పాల్ సింగ్ , అత‌ని మ‌ద్ద‌తుదారులు చేసిన విధ్వంసంపై తీవ్రంగా స్పందించారు. శ‌నివారం తీవ్రంగా స్పందించారు సీఎం. సిక్కు వేడుక నిర్వ‌హించ‌డం కోసం గురు గ్రంథ్ సాహిబ్ కాపీని తీసుకు వెళ్లార‌ని ఆరోపించారు. ఇలా ఎవ‌రూ చేయ‌ర‌ని అన్నారు.

హింస‌ను ప్రాతిప‌దికగా చేసుకుని రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోవ‌డం త‌ప్పేన‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా అమృత పాల్ సింగ్ సార‌థ్యంలో సానుభూతిప‌రులు ఏకంగా పోలీస్ ఠాణాపై దాడికి దిగారు. ఈ ఘ‌ట‌న దేశంలో క‌ల‌క‌లం రేపింది. ఒక ర‌కంగా భార‌త ఆర్మీకి స‌వాల్ విసిరారు పాల్. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ వాఖ వాచ్ చేస్తోంది. నిఘా వ‌ర్గాలు ఫుల్ గా ఫోక‌స్ పెట్టాయి.

గురు గ్రంథ్ సాహిబ్ తీసుకున్న ఏ పంజాబీ లేదా ఇత‌రులు ఎవ‌రైనా ఇలాంటి స‌మాజానికి హాని క‌లిగించే , ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేసే చ‌ర్య‌లు చేప‌ట్టర‌ని అన్నారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann Ajanala incident)  సిక్కు బోధ‌కుడిగా, ఖ‌లీస్తానీ సానుభూతి ప‌రుడిగా అమృత పాల్ సింగ్ గుర్తింపు పొందారు. హింస‌ను బోధించే వారికి కూడా కొంద‌రు మ‌ద్ద‌తు తెల‌ప‌డం స‌హ‌జ‌మేన‌ని దానిని ఆమోదించార‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని ఎద్దేవా చేశారు సీఎం. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని సీఎం మాన్ చెప్పారు.

Also Read : జో అప్నే బాప్ కా..యోగి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!