P Chidambaram : కాంగ్రెస్ ధైర్యంగా ప్ర‌క‌ట‌న చేయాలి

స్ప‌ష్టం చేసిన కేంద్ర మాజీ మంత్రి

P Chidambaram Statement : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పి.చిదంబ‌రం (P Chidambaram) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ లో జ‌రిగిన 85వ పార్టీ ప్లీన‌రీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ప్ర‌స్తుత అస‌మాన‌త‌లు రాజ‌కీయ అస్థిర‌త‌తో పాటు సామాజిక క‌ల‌హాల‌కు దారి తీస్తాయ‌ని హెచ్చిరంచారు. ఈ స‌మ‌య‌మే పార్టీకి అత్యంత కీల‌క‌మ‌న్నారు పి. చిదంబ‌రం. భార‌త దేశంలోని అట్ట‌డుగున ఉన్న 50 శాతం జ‌నాభాను పేద‌రికం నుంచి బ‌య‌ట ప‌డేయ‌డ‌మే భ‌విష్య‌త్ ప్ర‌భుత్వంలో త‌మ త‌దుప‌రి క‌ర్త‌వ్య‌మ‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ముసాయిదా ఆర్థిక తీర్మానంపై చ‌ర్చ‌ను ముగించారు. సంప‌ద‌ను పునః పంపిణీ చేసే ల‌క్ష్యంతో భార‌త ఆర్థిక విధానాల‌ను తిరిగి సెట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు పి. చిదంబ‌రం(P Chidambaram Statement) . మ‌నం బ‌హిరంగ‌, పోటీ త‌త్వ , ఉదార‌వాద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్వీక‌రించిన‌ట్లే దేశంలోని 50 శాతం కంటే ప్ర‌జ‌లు అత్యంత పేద‌రికంలో ఉన్నార‌ని అన్నారు. సూటిగా ప్ర‌క‌టించాల‌న్నారు.

అత్య‌ధిక శాతం మందిని సంప‌ద వారీగా పార్టీ త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రంగా బ‌హిరంగంగా ద‌త్త‌త తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు పి. చిదంబ‌రం. 1991లో పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వ హ‌యాంలో స‌ర‌ళీక‌ర‌ణ లో భాగంగా ప్ర‌వేశ పెట్టిన తొలి ఆర్థిక విధానాలు వేగంగా వృద్ది చెందే ప‌రిస్థితుల‌ను సృష్టించాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మిగ‌తా స‌గం మందికి స‌మానంగా పంపిణీ జ‌రిగేలా చూస్తామ‌ని బ‌హిరంగంగానే కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌ట‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు పి.చిదంబ‌రం.

Also Read : అంతిమ విజ‌యం మ‌న‌దే – సోనియా

Leave A Reply

Your Email Id will not be published!