Congress Plenary : ద్వేష పూరిత నేరాలపై ఉక్కుపాదం

కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీలో తీర్మానం

Congress Plenary Action : ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీన‌రీ స‌మావేశంలో(Congress Plenary Action) కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగంగా ద్వేష పూరిత నేరాల‌కు వ్య‌తిరేకంగా కొత్త చ‌ట్టం తీసుకు రావాల‌ని కోరింది. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొత్త విజ‌న్ డాక్యుమెంట్ ను ప్ర‌క‌టించింది. దేశంలో ఈవీఎంల స‌మ‌స్య‌ను చేప‌ట్టేందుకు అన్ని భావాలు క‌లిగిన రాజ‌కీయ పార్టీల‌తో సాధ్య‌మైన విశాల‌మైన ఏకాభిప్రాయాన్ని క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది పార్టీ.

ద్వేష పూరిత నేరాలు, మ‌త ప‌ర‌మైన వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా కొత్త చ‌ట్టాల వాగ్ధానం , ప్రాణాంతకంగా లోప‌భూయిష్ట‌మైన , పూర్తిగా అవినీతి మ‌యం అయిన ఎన్నిక‌ల బాండ్ల‌కు బ‌దులుగా జాతీయ ఎన్నిక‌ల నిధి, చ‌ట్ట స‌భ్యుల భారీ వ‌ల‌స‌ల‌ను ఆపేందుకు ఫిరాయింపు నిరోధ‌క చ‌ట్టాన్ని మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ తీర్మానం(Congress Plenary Action) చేసింది. స‌మాన భావాలు క‌లిగిన లౌకిక శ‌క్తుల‌ను గుర్తించేందుకు , స‌మీక‌రించేందుకు అంద‌రూ క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల‌ని పార్టీ కోరింది.

85వ ప్లీన‌రీ స‌మావేశంలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. శ‌శి థ‌రూర్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి సంబంధించి భావ‌జాలం మారాల్సి ఉంద‌న్నారు.

జాతీయ ఎన్నిక‌ల కోసం కొత్త విజ‌న్ డాక్యుమెంట్ ను ప్ర‌క‌టించింది. ఒక వేళ భార‌త ఎన్నిక‌ల సంఘం స్పందించ‌క పోతే కోర్టుకు వెళ్లాల‌ని కోరింది. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ‌ల్ల పెద్ద ఎత్తున నిధులు బీజేపీకి చేరాయ‌ని పార్టీ ఆరోపించింది. వీట‌న్నింటిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది.

Also Read : బిల్కిస్ బానోకు అండ‌గా నిల‌వాలి

Leave A Reply

Your Email Id will not be published!