Sonia Gandhi : అంతిమ విజయం మనదే – సోనియా
భారత్ జోడో యాత్ర సక్సెస్
Sonia Gandhi Leadership : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఆపై రాబోయే కాలం పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే అవుతుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశ చరిత్రలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చిరస్థాయిగా నిలిచి పోతుందని చెప్పారు.
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగిన 85వ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ(Sonia Gandhi Leadership) ప్రసంగించారు. ఈ ప్లీనరీకి 15,000 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. పలు కీలకమైన అంశాలపై తీర్మానాలు చేశారు. ధైర్యం, శక్తితో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
2004, 2009 లలో వరుసగా కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చిన ఘనత మీకే దక్కుతుందన్నారు సోనియా గాంధీ. 1998లో తొలిసారిగా 137 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా పని చేసే అవకాశం లభించిందని చెప్పారు. ఈ 25 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విజయాలను సాధించిందని, అదే సమయంలో తీవ్ర నిరాశకు గురి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారను సోనియా గాంధీ(Sonia Gandhi).
డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థ నాయకత్వంతో పాటు నాకు వ్యక్తిగతంగా కూడా సంతృప్తి కలిగిచిందన్నారు. కాగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మాత్రం భారత్ జోడో యాత్రతో ముగియడమేనని పేర్కొన్నారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన పాదయాత్ర పార్టీలో టర్నింగ్ పాయింట్ గా అభివర్ణించారు. భారత ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారనే విషయం యాత్ర ద్వారా రూఢీ అయ్యిందన్నారు సోనియా గాంధీ.
Also Read : ద్వేష పూరిత నేరాలపై ఉక్కుపాదం