Case File AAP BJP : ఆప్..బీజేపీ కౌన్సిలర్లపై కేసు
హింసకు పాల్పడ్డారనే అభియోగం
Case File AAP BJP : ఎంసీడీలో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల నియామకంలో చోటు చేసుకున్న గందరగోళం తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. చివరకు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరిగింది.
మేయర్, డిప్యూటీ మేయర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు షెల్లీ, మహ్మమద్ ఇక్బాల్ ఎన్నికయ్యారు. కానీ ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
ఆప్, బీజేపీ కౌన్సిలర్లు బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో బెంబేలెత్తించారు. వెంబడించారు. చివరకు ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకరకంగా యుద్ద వాతారణాన్ని తలపింప చేసింది. కొత్తగా ఎన్నికైన షెల్లీ సభ్యుల ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. హద్దు మీరి ప్రవర్తించిన ఆప్ , బీజేపీ కౌన్సిలర్లపై పోలీసులు కేసు నమోదు(Case File AAP BJP ) చేశారు. ఆప్ , బీజేపీ బాహా బాహీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ఇక ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి శుక్రవారం జరిగిన ఓటింగ్ సందర్భంగా మేయర్ షెల్లీ ఒబేరాయ్ ఒక ఓటు చెల్లదని ప్రకటించాడు. దీంతో వాగ్వావాదం చోటు చేసుకుంది. ఆప్, బీజేపీ పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
ఎంతకూ ఎన్నికకు సహకరించక పోవడంతో సోమవారం ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఎంసీడీ మేయర్ షీలా.
Also Read : ఆత్మ పరిశీలన లేని కాంగ్రెస్ ప్లీనరీ