Manish Sisodia CBI : రాజ్ ఘాట్ నుంచి సీబీఐ ఆఫీసుకు

భారీ అనుచ‌ర గ‌ణంతో సీబీఐ ఆఫీసుకు

Manish Sisodia Arrives : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా(Manish Sisodia Arrives) కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఆఫీసుకు బ‌య‌లు దేరారు. ఆయ‌న వెంట భారీగా ఆప్ శ్రేణులు త‌ర‌లి వ‌చ్చారు. మ‌రో వైపు విచార‌ణ కంటే ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు మ‌నీష్ సిసోడియా, యూపీ ఎంపీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హాత్ముడికి నివాళులు అర్పించారు. ఇప్ప‌టికే స‌మ‌న్లు జారీ చేసింది సీబీఐ. ఇప్ప‌టికే ద‌ర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది.

ఈ మేర‌కు 34 మందిపై అభియోగాలు మోపింది. 9 మందిని అరెస్ట్ చేసింది. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని , ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రో వైపు సీబీఐ కోర్టుకు ద‌ర్యాప్తు స‌మ‌ర్పించిన రెండో నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయ‌ని ఆరోపించింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, ఆయ‌న కొడుకు తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను కూడా చేర్చింది.

ఇదంతా కావాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నం త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ తీసి పారేశారు. విచిత్రం ఏమిటంటే స్వ‌యంగా మ‌నీష్ సిసోడియా ట్వీట్ చేశారు. అదేమిటంటే తన‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌బోతోందంటూ. మ‌రో వైపు త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం మేర‌కు త‌న స‌హ‌చ‌రుడు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాManish Sisodia) అరెస్ట్ కాబోతున్నారంటూ పేర్కొన్నారు. మొత్తంగా సిసోడియా వ్య‌వ‌హారంలో సీబీఐ ఏం చేస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : లిక్కర్ స్కాంలో సిసోడియా విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!