Antony Blinken Arrives : భారత్ కు చేరుకున్న ఆంటోనీ బ్లింకెన్
జీ20 సమావేశాల్లో పాల్గొనన్న విదేశాంగ మంత్రి
Antony Blinken Arrives : అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ జె బ్లింకెన్(Antony Blinken Arrives) మంగళవారం భారత్ కు విచ్చేశారు. జి20 గ్రూప్ కు భారత్ నాయకత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోని విదేశాంగ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది భారత్. ఇప్పటికే యుఎస్ ప్రభుత్వ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అని ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్ , అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత ధృఢంగా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతాయని తెలిపారు.
భారత్ పర్యటనలో భాగంగా ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తో కూడా భేటీ అవుతారు. ఆంటోనీ బ్లింకెన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది కేంద్రం. 2000లో భారత దేశానికి వచ్చారు ఆనాటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్. ఆ తర్వాత ట్రంప్ పలుమార్లు భారత్ ను సందర్శించారు. క్లింటన్ కొనసాగించిన వారసత్వాన్ని తాము కూడా అనుసరిస్తామని ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్ స్పష్టం చేశారు.
అంతే కాకుండా భారత దేశంలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆనాటి యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. దీనిని ట్రంప్ కొనసాగించారు కూడా. చైనాతో వ్యూహాత్మకంగా వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్న అమెరికా తెలివిగా భారత్ తో మైత్రీ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ తరుణంలో బ్లింకెన్ పర్యటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇరు దేశాల మధ్య కీలకమైన అంశాలపై చర్చకు రానున్నాయి.
Also Read : హిందూ మతం గొప్పది – జస్టిస్ జోసెఫ్